యూరియా కోసం ఆందోళన వద్దు
దహెగాం: యూరియా కోసం రైతులు ఆందో ళన చెందవద్దని, యాసంగి సాగుకు సరిపడా నిల్వలు ఉన్నాయని డీఏవో వెంకట్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో బుధవారం ఫర్టిలైజర్ దుకాణాల యజమానులకు యూరియా బుకింగ్ యాప్‌పై అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరూ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. యూరి యా బుకింగ్ చేసుకున్న రైతులకు సకాలంలో అందించాలన్నారు. అలాగే భూమి ఉన్న ప్రతిఒక్కరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అనంతరం మన గ్రోమోర్ సెంటర్‌ను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో ఏవో రామకృష్ణ, ఏఈవోలు సుష్మిత, ఆదిత్య, లావణ్య తదితరులు పాల్గొన్నారు.


