పోలింగ్ వివరాలు
ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు
రెండు మున్సిపాలిటీల్లో కలిపి 70.99 శాతం పోలింగ్
ఉదయం నుంచే ఓటేసేందుకు బారులు తీరిన ఓటర్లు
పలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ, అధికారులు
రేపు కౌంటింగ్, ఫలితాల వెల్లడి
ఆసిఫాబాద్: మున్సిపల్ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశా యి. కౌన్సిలర్ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం బ్యా లెట్ బాక్స్‌ల్లో నిక్షిప్తమైంది. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో ఉదయం 7 గంటల నుంచే కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 5 గంటలలోగా వచ్చిన వారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్‌లకు సీలు వేసి పోలీసు బందోబస్తు మధ్య జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు తరలించారు.
ఓటేసిన 43,754 మంది..
రెండు మున్సిపాలిటీల్లోని 50 వార్డుల్లో 65,132 మంది ఓటర్లు ఉన్నారు. 113 పోలింగ్ కేంద్రాల్లో 43,754 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ పెంచేందుకు అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకోవడంతో యువకులు, మహిళలు ఓటు వేయడానికి ఆసక్తి చూపారు. రెండు మున్సిపాలిటీల్లో సగటున 70.99 శాతం పోలింగ్ నమోదైంది. ఆసిఫాబాద్‌లో 13,927 మందికి 10,817(77.67శాతం) మంది, కాగజ్‌నగర్‌లో 51,205 మంది ఓటర్లకు 32,937(64.32శాతం) మంది ఓటు వేశారు. ఆసిఫాబాద్ ప ట్టణంలో అత్యధికంగా మూడో పోలింగ్ బూత్‌లో 88.29శాతం పోలింగ్ న మోదు కాగా, అత్యల్పంగా ఐదో పోలింగ్ బూత్‌లో 63.86శాతం పోలింగ్ నమోదైంది. కాగజ్‌నగర్‌లోని పలు వార్డుల్లో పోలింగ్ 60శాతం దాటలేదు. ఎమ్మెల్యే హరీశ్‌బాబు దంపతులు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఉర్దూ స్కూల్, జెడ్పీ బాలురు, బాలికల పాఠశాలల్లోని కేంద్రాలకు 200 మీటర్ల దూరం నుంచి పోలీసులు వాహనాలు అనుమతించలేదు.
పరిశీలించిన కలెక్టర్, అధికారులు
జిల్లా కేంద్రంతోపాటు కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ కె.హరిత, ఎస్పీ నితిక పంత్, ఇతర అధికారులు పరిశీలించారు. జన్కాపూర్ జెడ్పీ పాఠశాల, ఉర్దూ పాఠశాల, జెడ్పీ హైస్కూల్‌ను కలెక్టర్ తనిఖీ చేసి పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా రెండు మున్సిపాలిటీల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు చేశారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలురు, బాలికల పాఠశాలను అదనపు కలెక్టర్ దీపక్ తివారి పరిశీలించారు. పట్టణంలోని 12వ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆయన వెంట ఐఎఫ్‌ఎస్ అధికారి భార్గవ్ కుమార్ ఉన్నారు. కాగజ్‌నగర్‌లోని కేంద్రాలను ఎస్పీ నితిక పంత్, ఆసిఫాబాద్‌లోని కేంద్రాలను ఏఎస్పీ చిత్తరంజన్ సందర్శించారు. కాగజ్‌నగర్‌లో ఓటు వేసేందుకు ఓటరు వెంట వచ్చిన అతడి కుమార్తెతో ఎస్పీ ముచ్చటించారు.
జిల్లా కేంద్రంలోని బాలికల పాఠశాల వద్ద బారులు తీరిన ఓటర్లు
జాబితాలో తన వివరాలు తెలుసుకుంటున్న మహిళ
పదో వార్డులో పోలీసుల బందోబస్తు
రెండు కర్రల సాయంతో ఓటు వేసేందుకు వస్తున్న వృద్ధుడు
అంచనాల్లో తలమునకలు
ఎన్నికలు ముగియడంతో అభ్యర్థులు అంచనాల్లో తలమునకలయ్యారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థుల విజయావకాశాలపై చర్చలు ఊపందుకున్నాయి. గెలుపోటములపై ఎవరికి వారే ధీమాతో ఉన్నా.. లోలోన ఆందోళనతో ఉన్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 94మంది, కాగజ్‌నగర్‌లో 130 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ప్రస్తుతం వీరంతా ఈ నెల 13న విడుదలయ్యే ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ నెల 16న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. చైర్మన్ పీఠం కోసం స్పష్టమైన మెజార్టీ రాని పక్షంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
వృద్ధురాలిని వీల్‌చైర్‌లో తీసుకొస్తూ..
మున్సిపాలిటీ మొత్తం ఓటర్లు పోలైనవి మహిళలు పోలైనవి పురుషులు పోలైనవి ఇతరులు పోలైనవి ఆసిఫాబాద్ 13,927 10,817 7,103 5,483 6,822 5,333 02 01
కాగజ్‌నగర్ 51,205 32,937 26,193 16,831 25,004 16,101 08 05
పోలింగ్ వివరాలు
పోలింగ్ వివరాలు
పోలింగ్ వివరాలు
పోలింగ్ వివరాలు
పోలింగ్ వివరాలు
పోలింగ్ వివరాలు


