కఠినంగా కోడ్..
● ఉల్లంఘిస్తే మూల్యం తప్పదు
● ఎన్నికల ప్రవర్తనా నియమావళి సిద్ధం ● ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే వాహనాలకు ముందస్తు అనుమతి పొందాలి. ఒక అభ్యర్థికి కేటాయించిన వాహనాన్ని మరో అభ్యర్థి ప్రచారానికి వాడితే ఐపీసీ సెక్షన్ 171హెచ్ కింద శిక్షార్హులు అవుతారు. ఐపీసీలోని అధ్యాయం 9–ఏ ప్రకారం అనుమతి లేకుండా ప్రచారానికి వాడిన వాహనాన్ని జప్తు చేస్తారు.
● ఎన్నికల విధుల నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాలి. ఏ పార్టీకీ లేదా వ్యక్తులకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా పనిచేయరాదు. ఎన్నికల ప్రచారాల్లో భాగస్వామ్యం కావద్దు.
● ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రైవేట్ కార్యక్రమాల్లో, విందుల్లో పాల్గొనవద్దు. ప్రభుత్వ ధనాన్ని సభలు, సమావేశాలకు వినియోగించడం, ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు, వాహనాలను ప్రచార కార్యక్రమాలకు వినియోగించడం చేయవద్దు.
● అభ్యర్థులు ఎన్నికల వ్యయ పరిమితి మించి ఖర్చు చేయవద్దు.
● రిటర్నింగ్ అధికారి అభ్యర్థికి అందించిన నిర్దిష్ట నమూనాలో రోజూ వారీ ఖర్చుల వివరాలు రాయాలి. ప్రత్యేక ఖాతా తెరిచి అందులో నుంచి డబ్బులను విత్‌డ్రా చేయాలి.
● ఎన్నికల ఫలితాలు వెలువడిన 45 రోజుల్లో ఖర్చుల వివరాలన్నీ ఎన్నికల అధికారికి అందజేయాల్సి ఉంటుంది.
● కరపత్రం, పోస్టర్‌పై ప్రింటింగ్ ప్రెస్, ప్రచురణకర్త పేరు, చిరునామా తప్పనిసరిగా ప్రచురించాలి.
● గుడి, మసీదు, చర్చి ఇతర ప్రార్థన స్థలాలను వినియోగించ కూడదు. కుల, మతాల ప్రాతిపాదికన ఓట్లు అడగటం కూడా నేరమే.
● ప్రభుత్వ భవనాలు, కట్టడాలపై ఎన్నికల రాతలు రాయడం, పోస్టర్లు, అతికించడం నిషేధం. వీటి కోసం ప్రైవేట్ భవనాలు, నివాస గృహాల యజమానుల నుంచి ముందస్తు అనుమతి పొందాలి. ఆ అనుమతి పత్రాల జిరాక్సులను మూ డు రోజుల్లోగా సంబంధిత రిటర్నింగ్ అధికారికి అందజేయాలి.
● పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు బయటి నుంచి వచ్చిన రాజకీయ నాయకులు, కార్యకర్తలు స్థానికంగా ఉండకూడదు.
● పోలింగ్ రోజున కేంద్రానికి 200ల మీటర్ల వె లుపల ఒక టేబుల్, 2 కుర్చీలతో అభ్యర్థి ఎన్ని కల బూత్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకు స్థా నిక అధికారుల నుంచి అనుమతి పొందాలి. 100 మీటర్ల పరిధి లోపల ఎన్నికల ప్రచారం చే యకూడదు.మొబైల్‌ఫోన్‌ఉపయోగించకూడదు.
● రాత్రి 10 గంటలలోపు లౌడ్ స్పీకర్లు నిలిపివేయాలి. బహిరంగ ఎన్నికల సమావేశాలు, ఊరేగింపులు తీయాలన్నా, స్పీకర్లు వాడాలన్నా పోలీస్ శాఖ నుంచి లిఖిత పూర్వక అనుమతి తీసుకోవాలి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఎన్నికల ప్రచారానికి అనుమతి ఉంటుంది.
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు, అభ్యర్థుల కోసం ఎన్నికల సంఘం ఎన్నికల ప్రవర్తన నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) రూపొందించింది. భారత రాజ్యాంగంలోని 243–కె, 243–జెడ్‌ఏ విభాగాల కింద స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి ఈ మార్గదర్శకాలు అమలు చేస్తోంది. అధికార యంత్రాంగం కూడా ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యంగా, పక్షపాతంగా వ్యవహరించకుండా ఈ నియమావళి ఉపయోగపడుతుంది. ఎన్నికల్లో నేరాలు, అక్రమాలు, అవినీతి, వంచన, లంచగొండి తనం, ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరింపులను నివారించడం నిబంధనల లక్ష్యం. ఈ నిబంధనలు ఎవరూ ఉల్లంఘించినా చర్యలు తప్పవు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నాటినుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేస్తారు.
నిబంధనలు ఇవే..