రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
నిర్మల్‌రూరల్: మండలంలోని రాణాపూర్ గిరిజన పాఠశాల విద్యార్థులు సికిందర్, కృష్ణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు భూక్య రమేశ్ తెలిపారు. ఈ నెల 4న మంచిర్యాలలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 6, 7, 8 తేదీల్లో నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లిలో జరుగనున్న పోటీల్లో సదరు విద్యార్థులు పాల్గొననున్నట్లు తెలిపారు. జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శైలజ, జిల్లా క్రీడల అధికారి భూక్యా రమేశ్ హర్షం వ్యక్తం చేశారు.
జెట్టక్కను సాగనంపిన గ్రామస్తులు
కడెం: ఊరు కీడు తొలగిపోయి, అంతా మంచే జరగాలని మండలంలోని సారంగపూర్ గ్రామస్తులు గురువారం జెట్టక్కను సాగనంపారు. పాత బట్టలు ధరించి, చీపుర్లు, చాటలతో నృత్యం చేస్తూ గ్రామ పొలిమేర దాటించారు. కా ర్యక్రమంలో సర్పంచ్ కోల తేజస్విని శ్రీనివాస్, ఉప సర్పంచ్ రమేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
నమ్మించి మోసగించిన ఒకరికి పదేళ్ల జైలు
ఆసిఫాబాద్‌రూరల్: యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించిన కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేశ్ గురువారం తీర్పునిచ్చినట్లు ఎస్పీ నితిక పంత్ తెలిపారు. ఆసిఫాబాద్‌కు చెందిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని బాధితురాలి ఫిర్యాదు మేరకు బొమ్మెన ప్రశాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ముగిసిన రోబోటిక్స్ శిక్షణ
మంచిర్యాలఅర్బన్: రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు అందించాలనే లక్ష్యంతో సోహం అకాడమీ ఆఫ్ హ్యుమన్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ బాలుర పాఠశాలలో నిర్వహిస్తున్న రోబోటిక్స్ ఇన్ అకాడమిక్స్ (ఆర్‌ఐఏ) కార్యక్రమం గురువారం ముగిసింది. శిక్షణలో పాల్గొన్న 101 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు, పాఠశాలకు రోబోటిక్స్ కిట్ అందించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ ప్రతినిధి నవ్యశ్రీ, హెచ్‌ఎం రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక


