ఢిల్లీలో ఉపాధ్యాయుల ధర్నా
నిర్మల్‌రూరల్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఢిల్లీలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు భూమన యాదవ్ మాట్లాడుతూ సీపీఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఇన్ సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలని, జాతీయ విద్యా విధానం పునఃసమీక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, నాగభూషణ్, బాజారెడ్డి, శ్రీనివాస్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.


