మౌలిక సదుపాయాల కల్పనకు కృషి | - | Sakshi
Sakshi News home page

మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

Feb 6 2026 7:55 AM | Updated on Feb 6 2026 7:55 AM

మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

● దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌ కుమార్‌ శ్రీ వాస్తవ

ఆదిలాబాద్‌: రైల్వేలో మౌలిక సదుపాయాల కల్ప నకు కృషి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌ కుమార్‌ శ్రీ వాస్తవ అన్నారు. ఆదిలాబాద్‌ రైల్వే స్టేషన్‌ను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని, ఇందుకు అనుగుణంగా అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అమృత భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా చేపడుతున్న ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. రైల్వే ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా క్రూలాబీ, రన్నింగ్‌ రూమ్‌, వంటశాలను నిర్మించినట్లు తెలిపారు. ఆయన వెంట నాందేడ్‌ డివిజన్‌ డీఆర్‌ఎం ప్రదీప్‌ కామ్లే, తదితరులు ఉన్నారు.

రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి కృషి చేయాలి

ఆదిలాబాద్‌ రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ జీఎంకు వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యులు గణేశ్‌ పాటిల్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానందం ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement