ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
ఆసిఫాబాద్: ప్రకృతి సిద్ధమైన వ్యవసాయాన్ని ప్రో త్సహించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. శనివా రం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతు వేదికలో ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆ దిశగా వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించాలన్నారు. అధిక మోతాదులో యూరి యా, డీఏపీ వాడకం తగ్గించాలని సూచించారు. ప శువుల పేడ, ఇతర సేంద్రియ ఎరువులను వినియోగించి పంటలు సాగు చేయడం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటి, సహాయ సంచాలకులు మనోహర్, మిలింద్ కుమార్, ఏఈవోలు పాల్గొన్నారు.
పాఠశాలల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలి
ఆసిఫాబాద్‌రూరల్: పాఠశాలల్లో పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ హరిత అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2024లో అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం కింద జిల్లాలో ఎంపికై న 720 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన పనులు వందశాతం పూర్తి చేయాలన్నారు. గ్రామ సమాఖ్య భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణ ప నులను స్థానిక సర్పంచుల భాగస్వామ్యంతో త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదన పు కలెక్టర్ దీపక్ తివారి, డీఆర్‌డీవో దత్తరావు, డీటీడీవో రమాదేవి, డీఎంహెచ్‌వో సీతారాం, ప్రణాళిక అధికారి వాసుదేవరెడ్డి, ఈఈ ధర్మేందర్, విద్యాశా ఖ, ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్య అందించాలి
రెబ్బెన: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్య మైన విద్యతో పాటు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ హరిత అన్నారు. గంగాపూర్‌లో గల కేజీబీవీని తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ పదోతరగతి విద్యార్థులను వార్షిక ప రీక్షలకు సన్నద్ధం చేయాలన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించారు. లక్ష్మీపూర్‌లో నర్సరీ నిర్వహణను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యులు, సిబ్బంది హాజరు పట్టిక పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది హాజరు పట్టిక పరిశీలించారు. తహసీల్దార్ సూర్యప్రకాష్, తదితరులు ఉన్నారు.
ప్రారంభానికి సిద్ధం చేయాలి
ఆసిఫాబాద్‌రూరల్: క్రిటికల్ కేర్ ఆస్పత్రిలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేసి ప్రారంభానికి సిద్దం చేయాలని కలెక్టర్ హరిత అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని అంకుసాపూర్ ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ ఆస్పత్రి పనులను పరిశీలించారు.


