ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు...
కాగజ్‌నగర్‌రూరల్: కొంతకాలంగా ఒకే పార్టీ లో ఉంటూ ఎడ మొహం, పెడ మోహంగా ఉంటున్న బీఆర్‌ఎస్ నాయకులు మాజీ ఎమ్మె ల్యే కోనేరు కోనప్ప, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఒకే వేదిక సాక్షిగా ఒక్కటయ్యారు. సర్‌సిల్క్‌కాలనీలో నిర్వహించిన ప్రచార సభలో వారిద్దరూ కరచాలనం చేసుకుని పక్కపక్కనే కూర్చున్నారు. పార్టీ గెలుపే లక్ష్యంగా వీరిద్దరూ ఒక్కటి కావడంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్‌ను నింపింది. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో అధిక స్థానాలను గెలుచుకుని చైర్మన్ పదవి స్థానా న్ని బీఆర్‌ఎస్ ఖాతాలో జమ చేసుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు.


