గుడ్‌టచ్ బ్యాడ్‌టచ్‌పై అవగాహన కల్పించాలి
చింతలమానెపల్లి: బాలికల సంరక్షణలో గుడ్‌టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించడం ఎంతో కీలకమని మహిళా సాధికారత కేంద్రం సమన్వయ కర్త శారద అన్నారు. శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయం, కేజీబీవీలో సర్పంచ్ మేకల పోచక్క అధ్యక్షతన మహిళలు, బాలికలకు అవగాహన కా ర్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బేటీ బచావో, బాల్య వివాహ ముక్త్ భారత్ 100 రోజుల కార్యక్రమాలను బాలికల సంరక్షణలో భాగంగా నిర్వహిస్తున్నామన్నారు. జెండర్ స్పెషలిస్ట్ రాణి మాట్లాడుతూ బాలికలపై లైంగిక వేధింపుల కు పాల్పడితే పోక్సో చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తారన్నారు. ఆర్థిక అక్షరాస్యత నిపుణుడు సాగర్ మాట్లాడుతూ సైబర్ క్రైం మోసాలు, రక్షణ మార్గాలు, సుకన్య సమృద్ధి యోజన పథ కం గు రించి వివరించారు. కార్యక్రమంలో చైల్డ్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అధికారి విజయలక్ష్మి, సూపర్‌వైజర్లు అరుణ, కరుణ, జిల్లా సమాఖ్య అధ్యక్షురా లు ప్రమీల, ఉపసర్పంచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.


