బరిలో యువత
ఆసిఫాబాద్‌రూరల్: ఆసిఫాబాద్ మున్సిపల్ ఎన్నికల బరిలో యువత పోటీలో ఉన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తరహాలో మున్సిపల్ ఎన్నికల్లో తాము గెలిస్తే ఏం చేస్తామో మేనిఫెస్టోలను ప్రకటిస్తున్నారు. వార్డుల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తీర్చేందుకు ముందుడి పని చేస్తామని హామీ ఇస్తున్నారు. మొదటిసారిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన యువతకు అవకాశం ఇవ్వాలని ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. పార్టీలు అవకాశం ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు.
ఎన్నికల్లో గట్టి పోటీ..
ఆసిఫాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో యువత గట్టి పోటీని ఇవ్వనున్నారు. వార్డులోని యువతను ఏకంచేసి గెలుపు దిశగా ప్రచారం చేస్తున్నారు. వీడియోలు తీసి వాట్సాప్ గ్రూప్‌లు, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్, తదితర సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి యువత మెర్రే ఆకాష్ 3 వార్డు, తస్కిన్ 5వార్డు (బీటెక్), మోహన్ 2వ వార్డు, కార్తీక్, బాలకృష్ణ 4వ వార్డు, కాంగ్రెస్ నుంచి భీంరావు 1వ వార్డు, సాయి 3వ వార్డు, రాజ్‌కుమార్ 4వ వార్డు, రాపర్తి కార్తీక్ 11వ వార్డు, స్నేహ 13వ వార్డు, జనసేన నుంచి క్రాంతి కుమార్ 6వ వార్డు, పవన్ కళ్యాణ్ 9వ వార్డు, సాయి కిరణ్ 11వ వార్డు, సారిక 14వ వార్డు (బీజేపీ), కావ్య 7వ వార్డు (బీజేపీ), సోని 19వ వార్డు (స్వతంత్ర) నుంచి పోటీలో ఉన్నారు.


