పనిచేసే వారికే పట్టం
ఆసిఫాబాద్‌అర్బన్: నూతనంగా ఏర్పడిన ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. తమ కాలనీలను అభివృద్ధి చేసే వారికే పట్టం కడతామని ఈ సందర్భంగా పట్టణ వాసులు స్పష్టం చేస్తున్నారు. పార్టీలు ఏవైనా ఫర్వాలేదు కానీ ప్రజలకు సేవ చేసే మంచి నాయకుడికి తమ మద్దతు ఉంటుందని పేర్కొంటున్నారు. రహదారులు, డ్రెయినేజీ వ్యవస్థ, తాగునీరు, పారిశుద్ధ్య నివారణతో పాటు పలు కాలనీల్లో విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, నూతనంగా ఎన్నికయ్యే కౌన్సిలర్లు పరిష్కరించాలని కోరుతున్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన డిబేట్‌లో పాల్గొని పలువురు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.


