తెలంగాణ సాయుధ పోరు నుంచి.. రంగనాథ్‌రావు
తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపా త్ర పోషించిన డాక్టర్ రంగనాథ్‌రావు బొల్లా న్‌వార్ ఈ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఆవిర్భావంతోనే ఎన్నికల బరిలో నిలిచారు. నాడు నిజాం నిరంకుశానికి వ్యతి రేకంగా ఉద్యమించిన సీపీఐపై అప్పట్లో నిషేధం విధించారు. దీంతో ఆ పార్టీకి చెందిన నాయకుడైనప్పటికీ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) తరఫున మున్సిపల్ బరి లో నిలిచారు. అధ్యక్షుడిగా విజయం సా ధించి 1952 నుంచి 1961 వరకు దాదాపు దశాబ్దకాలం పాటు పట్టణ ప్రజలకు సేవలందించారు. ఈక్రమంలో అదేపార్టీ తరఫున 1957 లో ఎమ్మెల్యేగా పోటీచేసి ప్రజల మద్దతుతో అసెంబ్లీలో అడుగుపెట్టారు. చైర్మన్, ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన మరోసారి మున్సి పల్ బరిలో నిలిచి గెలుపొందారు. 1967 ను ంచి 1972 వరకు చైర్మన్‌గా సేవలందించా రు. పదవులు చేపట్టినప్పటికీ అధికార దర్ప ం ప్రదర్శించకుండా సామాన్యుడివలే కాలినడకన తిరిగేవారని ఆయన వ్యక్తిత్వాన్ని ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు.


