గిరిజనుల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి
ఉట్నూర్‌రూరల్: గిరిజనుల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవా న్ని సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీ వో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ గిరిజనుల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు అర్హులకు అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ మాట్లాడుతూ ఆశ్రమాలు, గు రుకులాల విద్యార్థులకు ఐటీడీఏ ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. ఎకో టూరిజం శాఖ పరిధిలో కుంటాల, ఉట్నూర్ కోట, అడ ప్రాజెక్టు వద్ద అభివృద్ధి పనులు చేపడుతున్న ట్లు తెలిపారు. అనంతరం కేబీ కాంప్లెక్స్ క్రీడా మై దానంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించా రు. విద్యార్థులు పలు సినీ, దేశభక్తి గీతాలపై చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఐటీడీఏ పరిధిలో ఉద్యోగులకు బెస్ట్ అప్రిషియేషన్ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గిరిజనుల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి


