డీలర్ల వద్దే వాహన రిజిస్ట్రేషన్
మంచిర్యాలరూరల్(హాజీపూర్): కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ బాధ్యతలను ప్రభుత్వం షోరూమ్ డీలర్లకు అప్పగించింది. దీంతో వాహనాదారులకు మధ్యవర్తి ప్రమేయం లేకుండా ఉండడమే కాదు ఖర్చు, సమయం ఆదా అవుతుంది. వాహనదారులకు ఇకపై రిజిస్ట్రేషన్ కష్టాలు దూరం కానుండగా.. రవాణా శాఖ అధికారులకు పనిభారం తగ్గింది. ప్రభుత్వం రవాణా శాఖ, డీలర్ షోరూమ్‌ను అనుసంధానం చేస్తూ ఓ కొత్త సాఫ్ట్‌వేర్‌తో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో ద్విచక్ర వాహన షోరూమ్‌లు 20కి పైగా ఉండగా ఇందులో 12 షోరూమ్‌లకు మాత్రమే వాహన రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పించారు. వివిధ కంపెనీల కార్ల షోరూమ్‌లు ఉన్నా ఒక్క షోరూమ్ మినహా మిగతా వాటి ప్రధాన షోరూములన్నీ కరీంనగర్‌లోనే ఉన్నాయి. ఇక్కడ కారు కొన్నా రిజిస్ట్రేషన్‌కు కరీంనగర్ వెళ్లాల్సిందే. ద్విచక్ర వాహనాలు రోజుకు 30 నుంచి 60 వరకు, ఐదు నుంచి పది వరకు కార్లు విక్రయిస్తున్నారు. గతంలో వాహనం విక్రయించిన సమయంలో అన్ని కార్యకలాపాలు, లావాదేవీలు పూర్తి చేసి తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రం ఇచ్చేవారు. ఆ పత్రాలు తీసుకుని వాహనదారుడు రిజిస్ట్రేషన్ కోసం ర వాణా శాఖకు వెళ్లాల్సి వచ్చేది. ఇందుకోసం కొంత డబ్బు ఖర్చు, ఓ మధ్యవర్తి ప్రమేయం ఇలా స మయం వృథా అయ్యేది. ఇప్పడు ఆ సమస్యలేవీ ఉండవు. వాహన డీలర్ వద్దే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ప్ర త్యేక సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఫ్యాన్సీ నంబర్‌కు అదనపు రుసుం
వాహనాలకు కోరుకున్న, ఫ్యాన్సీ నంబరు కావాలంటే తాత్కాలిక రిజిస్ట్రేషన్‌తో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. ఇందుకు అదనపు రుసుంచెల్లిస్తే నంబ ర్‌ను రవాణా శాఖ అధికారులు కేటాయిస్తారు. ఇందుకోసం కొంత సమయం పడుతుందని, అప్పటివరకు నిరీక్షించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.


