అభివృద్ధిలో సింగరేణి పాత్ర కీలకం
జైపూర్: దేశ, రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి తెలిపారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో సోమవారం 77వ గణతంత్ర దినోత్స వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈడీ చిరంజీవి అడ్మిన్ భవన కా ర్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతర ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ, ఎంతోమంది మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాంతంత్య్రం సిద్ధించిందని, భారతదేశానికి రాజ్యాంగం ఒక దిక్సూచి లాంటిదని తెలిపారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికై న అవంచ సంతోశ్‌కుమార్, బర్ల తిరుపతిలను శాలువాలతో సన్మానించి అవార్డులతో సత్కరించారు. ఇటీవల కోల్‌ఇండియా స్థాయిలో కర్ణాటక సంగీతంలో బంగారు పతకం సాధించిన బండి శ్రీనిధి, వేణుగానంలో కాస్యం పతకం సాధించిన బండి రవీంద్రకుమారస్వామిని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఫిట్ సెక్రెటరీ సత్యనారాయణ, సీఎంవోఏఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ పంతులా, సీఐఎస్‌ఎఫ్ కమాండెంట్ చంచల్ సర్కార్, పీఎంపీఎల్ హెడ్ అఖిల్‌కపూర్, డీజీఎం కిరణ్‌బాబు, ఇతరశాఖల అధికారులు పాల్గొన్నారు.


