కర్తవ్య్‌పథ్‌లో మనోళ్లు
భీమిని: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఢిల్లీలోని కర్తవ్య్‌పథ్‌లో నిర్వహించిన వేడుకల్లో భీమిని మండలం వీగాం గ్రామానికి చెందిన ఇద్దరు కళాకారులు పాల్గొని ఒగ్గుడోలు విన్యాసం ప్రదర్శించారు. సౌత్ జోన్ సెంటర్ నుంచి 30 మందిని ఎంపిక చేయగా అందులో వీగాం గ్రామానికి చెందిన బొప్పనపల్లి రవి, అమరగొండ అజయ్ ఉన్నారు. వీరిద్దరూ ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్, జాతీయ పురస్కార గ్రహీత ఒగ్గు రవి నేతృత్వంలో ఈ నెల 8న ఢిల్లీ వెళ్లి రిహార్సల్స్ చేశారు. కర్తవ్య్‌పథ్ వేదికగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎదుట ఒగ్గు డోలు ప్రదర్శనకు తమకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని రవి, అజయ్ పేర్కొన్నారు.


