బాడీ బిల్డింగ్ పోటీల్లో ప్రతిభ
బెల్లంపల్లి: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ సీఈఆర్ క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీల్లో బెల్లంపల్లి స్కైజిమ్‌కు చెందిన పలువురు బాడీ బిల్డర్లు పతకాలు సాధించారు. ఆదిలాబాద్ జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో బెల్లంపల్లి స్కైజిమ్‌కు చెందిన జి.లక్ష్మణ్ (75 కిలోలు), జె.మొగిలి (80 కిలోలు), డి.ప్రశాంత్ (85 కిలోలు) ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. మాస్టర్స్ విభాగంలో పి.కృష్ణస్వామి (55 కిలోలు), తృతీయ బహుమతి, ఎం.రోహిత్ (60 కిలోలు) తృతీయ బహుమతి, జూనియర్స్ విభాగంలో నాలుగో స్థానం దక్కించుకున్నాడు. జూనియర్స్ విభాగంలో మీర్జా హుమాయున్, ఎం.మహేష్, కె.నగేష్ ఐదోస్థానంలో నిలిచిట్లు స్కైజిమ్ నిర్వాహకులు పి.సదానందం, బాలకృష్ణ, చంద్రశేఖర్ తెలిపారు.


