టాలెంట్‌ టెస్టులతో విద్యార్థుల్లో పోటీతత్వం | - | Sakshi
Sakshi News home page

టాలెంట్‌ టెస్టులతో విద్యార్థుల్లో పోటీతత్వం

Feb 3 2026 7:43 AM | Updated on Feb 3 2026 7:43 AM

టాలెంట్‌ టెస్టులతో విద్యార్థుల్లో పోటీతత్వం

టాలెంట్‌ టెస్టులతో విద్యార్థుల్లో పోటీతత్వం

కాగజ్‌నగర్‌టౌన్‌: టాలెంట్‌ టెస్ట్‌లు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచుతాయని కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహీదుద్దీన్‌ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల(ఓల్డ్‌)లో తెలంగాణ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్‌ ప్రతిస్ఠాన్‌ సౌజన్యంతో విద్యార్థులకు టాలెంట్‌ టెస్టులు నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ టాలెంట్‌ టెస్ట్‌లతో పోటీ పరీక్షలపై అవగాహన పెరుగుతుందన్నారు. విద్యార్థులు లక్ష్యాలు నిర్దేశించుకుని, వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు. టాలెంట్‌ టెస్టులో సిర్పూర్‌(టి) జెడ్పీఎస్‌ఎస్‌ విద్యార్థి అయ్‌ ప్రథమ స్థానంలో నిలవగా, జెడ్పీఎస్‌ఎస్‌ రాస్పెల్లికి చెందిన కార్తీక్‌ ద్వితీయస్థానం, జెడ్పీఎస్‌ఎస్‌ వేంపల్లి విద్యార్థి అంజలి, జెడ్పీఎస్‌ఎస్‌ జన్కాపూర్‌ విద్యార్థి శ్రీకాంత్‌ తృతీయ స్థానంలో నిలిచారు. వీరికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నజీర్‌ అహ్మద్‌, చంద్రశేఖర్‌, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement