డిజిటల్‌ బోధనతో మెరుగైన ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ బోధనతో మెరుగైన ఫలితాలు

Feb 3 2026 7:43 AM | Updated on Feb 3 2026 7:43 AM

డిజిటల్‌ బోధనతో  మెరుగైన ఫలితాలు

డిజిటల్‌ బోధనతో మెరుగైన ఫలితాలు

ఆసిఫాబాద్‌రూరల్‌: డిజిటల్‌ బోధనతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో సోమవారం ఇన్‌ఫర్మేషన్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ టెక్నాలజీపై ప్రధానోపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గూగుల్‌ షీ ట్స్‌, డాక్స్‌పై అవగాహన కల్పించారు. ఆయ న మాట్లాడుతూ జిల్లాలోని 18 పీఎంశ్రీ పాఠశాలల్లో ఐసీటీ, ఏఐ ద్వారా విద్యాబోధన చే యాలన్నారు. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. పీఎంశ్రీ పాఠశాలలను మోడల్‌ స్కూళ్లుగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో రిసోర్స్‌పర్సన్లు జమున దాస్‌, సదానందం, సమ్మయ్య, రంజిత్‌ రాజ్‌, చంద్రయ్య, ప్రిన్సిపాల్‌ మహేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement