అడవుల రక్షణలో నిర్లక్ష్యం చూపొద్దు | - | Sakshi
Sakshi News home page

అడవుల రక్షణలో నిర్లక్ష్యం చూపొద్దు

Feb 3 2026 7:43 AM | Updated on Feb 3 2026 7:43 AM

అడవుల రక్షణలో నిర్లక్ష్యం చూపొద్దు

అడవుల రక్షణలో నిర్లక్ష్యం చూపొద్దు

చింతలమానెపల్లి: అడవుల రక్షణలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం చూపొద్దని డీఎఫ్‌వో నీరజ్‌కుమార్‌ అన్నారు. చింతలమానెపల్లి మండలం ఖర్జెల్లి రేంజ్‌ పరిధిలోని బీట్‌లను సోమవారం ఎఫ్‌డీవో అప్పయ్యతో కలిసి పరిశీలించారు. బాలాజీ అనుకో డ, గంగాపూర్‌, ఖర్జెల్లి నర్సరీలను సందర్శించారు. దిందా, బందెపల్లి బీట్‌లలో స్వాధీనం చేసుకున్న పోడు భూములు, దిందా ప్లాంటేషన్‌ను పరిశీలించారు. సోలార్‌ పిట్‌ల నిర్వహణ, అభివృద్ధి పనుల వివరాలు తెలుసుకున్నారు. సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌వో సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఖర్జెల్లి రేంజ్‌లో అటవీ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement