నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సస్పెన్షన్‌

Feb 3 2026 7:43 AM | Updated on Feb 3 2026 7:43 AM

నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సస్పెన్షన్‌

నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సస్పెన్షన్‌

ఆసిఫాబాద్‌రూరల్‌: విధుల్లో నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వినోదను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ కె.హరిత ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్‌ కళాశా ల, వసతి గృహాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రిన్సిపాల్‌ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ డిసెంబర్‌ 29 నుంచి ప్రిన్సిపాల్‌ ముందస్తు అనుమతి లేకుండా కళాశాలకు గైర్హాజరవుతున్నారని తెలిపారు. డిసెంబర్‌ నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమైనా ఇప్పటివరకు తరగతులు నిర్వహించలేదన్నారు. వ్యక్తిగత పనులు చేయించుకుంటున్నారని విద్యార్థుల నుంచి ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement