ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు షురూ | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు షురూ

Feb 3 2026 7:43 AM | Updated on Feb 3 2026 7:43 AM

ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు షురూ

ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు షురూ

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లాలో ఏర్పాటు చేసిన 15 కేంద్రాల్లో సోమవారం ఇంటర్మీడియెట్‌ ప్రయోగ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిన పరీక్షకు జనరల్‌ విభాగంలో 463 మంది విద్యార్థులకు 447 మంది హాజరుకాగా, 16 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విభాగంలో 599 మందికి 533 మంది హాజరు కాగా 66 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించిన పరీక్షకు జనరల్‌ విభాగంలో 384 మందికి 375 మంది హాజరు కాగా తొమ్మిది మంది పరీక్ష రాయలేదు. ఒకేషనల్‌ విభాగంలో 595 మందికి 582 మంది హాజరు కాగా 13 మంది గైర్హాజరయ్యారు. డీఐఈవో రాందాస్‌ వాంకిడి, ఆసిఫాబాద్‌లోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement