ఖర్చుల వివరాలు స్పష్టంగా నమోదు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఖర్చుల వివరాలు స్పష్టంగా నమోదు చేయాలి

Feb 6 2026 7:52 AM | Updated on Feb 6 2026 7:52 AM

ఖర్చుల వివరాలు స్పష్టంగా నమోదు చేయాలి

ఖర్చుల వివరాలు స్పష్టంగా నమోదు చేయాలి

ఆసిఫాబాద్‌అర్బన్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుల వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని ఎన్నికల పరిశీలకుడు దేవేందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గల ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో మున్సిపల్‌ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఫ్లయింగ్‌, స్టాటిస్టిక్‌ సర్వేయలెన్స్‌ బృందాలు, మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ, వీడియో సర్వేయలెన్స్‌, సీఎంసీ బృందాలతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చెక్‌పోస్టుల వద్ద ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని, రూ.50వేలకు మించి నగదు తరలిస్తే సరైన అనుమతి పత్రాలు పరిశీలించాలన్నారు. అనుమతి పత్రాలు లేకుంటే నగదు సీజ్‌ చేయాలని ఆదేశించారు. అభ్యర్థుల సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిఘా పెట్టాలని, పత్రికల్లో వచ్చే పెయిడ్‌ న్యూస్‌, ప్రచార ప్రకటనలు, ప్రసార సాధనాల్లో వచ్చే చెల్లింపు వార్తలపై ప్రతిరోజూ నివేదికలు అందించాలన్నారు. ఎకై ్సజ్‌ శాఖ అధికారులు నిల్వ వివరాలు, అమ్మకాల నివేదికలు అందించాలని ఆదేశించారు. సమావేశంలో లైజనింగ్‌ అధికారి నదీమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement