సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ అన్నారు. ఈ నెల 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నేపథ్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డీఎం రాజశేఖర్‌కు సమ్మె నోటీసులు అందించారు. ఆయన మాట్లాడుతూ వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, వృద్ధిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ 2020, సామాజిక భద్రత కోడ్ 2020 కార్మికులు పోరాడి సాధించుకున్న హ క్కులను నీరుగారుస్తాయని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు దివాకర్, లక్ష్మణ్, ప్రవీణ్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.


