సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలి

Feb 9 2026 7:30 AM | Updated on Feb 9 2026 7:30 AM

సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలి

సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలి

రెబ్బెన: దేశ వ్యాప్తంగా ఈనెల 12న చేపట్టబోయే సార్వత్రిక సమ్మెను సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు, ఓబీ, కోల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికులు పాల్గొ ని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్‌ అధ్యక్షుడు బోగే ఉపేందర్‌ అన్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్‌ కోడ్‌లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఖైరిగూర ఓసీపీ ఓబీ కాంట్రాక్టు సంస్థ ప్రతి నిధి శ్రీనివాస నాయుడుకు సమ్మె నోటీస్‌ అందించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులను కట్టు బానిసలు గా తయారుచేయాలని కార్పొరేటర్లకు అనుకూలంగా లేబర్‌ కోడ్‌లను తీసుకువచ్చిందన్నారు. వెంటనే లేబర్‌కోడ్‌లను రద్దు చేసి కార్మిక చట్టాలను తిరిగి అ మలు చేయాలన్నారు. సింగరేణిలో నూతన బొగ్గు బావులను ఓపెన్‌ చేయాలని, బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని పేర్కొన్నారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనంగా రూ. 26వేలు చెల్లించా లని, కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి సింగరేణి యా జమాన్యమే కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు చె ల్లించాలని తెలిపారు. సింగరేణి కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌, ఓబీ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు ఐటీ నుంచి మి నహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్ర భుత్వం అవలంభిస్తున్న ప్రైవేటీకరణ చర్యలను కా ర్మికులు పోరాటాలతో అడ్డుకోవాలన్నారు. జిల్లా కౌన్సిల్‌ సభ్యులు సాగర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement