మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు చర్యలు

Feb 11 2026 7:25 AM | Updated on Feb 11 2026 7:25 AM

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు చర్యలు

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు చర్యలు

ఆసిఫాబాద్‌: జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్‌ ద్వారా మంగళవారం ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ ఎ న్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. పోలింగ్‌ సరళిని వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఈ–డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ గౌతమ్‌ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement