ప్రేమమయుడైన యేసు శాంతి మార్గం అందరికీ అనుసరణీయమని కౌటాల చర్చి ఫాదర్ టోమ్ అన్నారు. కౌటాల కతోలిక చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రై డే నిర్వహించారు. ప్రజలను పాపముల నుంచి రక్షించడానికి యేసు క్రీస్తు శిలువ వేయబడ్డారని తెలిపారు. విజయనగరం చర్చిలో ఫాదర్ సీజో, యాపలగూడలో ఫాదర్ శేరిన్, శివలింగాపూర్ చర్చిలో పాస్టర్ సువార్త రాజన్న, సదాశివపేట చర్చిలో పాస్టర్ శ్రీనివాస్ దేవుని వాక్యం బోధించారు. యేసు మరణానికి గుర్తుగా ఏటా గుడ్‌ఫ్రైడే నిర్వహిస్తారని తెలిపారు. మండల కేంద్రంతోపాటు విజయనగరం, యాపలగూడ, చింతలమానెపల్లి మండలం బాలజీ అనుకోడ, సిర్పూర్(టి) గ్రామాల్లోని క్రైస్తవులు కౌటాలకు చేరుకుని కీర్తనలు పాడుతూ ఆర్టీసీ బస్టాండ్ నుంచి శాంతి ర్యాలీగా కల్వరి గిరిపైకి వెళ్లారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. – కౌటాల


