ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య జయంతి ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి రమాదేవి, మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరిగెల నాగేశ్వర్‌రావు, అరిగెల మల్లికార్జున్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మిషన్ భగీరథ ఈఈ సిద్దిక్, విశ్రాంత ఎస్సై వెంకన్న, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు అవుడపు ప్రణయ్, దూడల అశోక్, కుల సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.


