సీఎం కప్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని బాబాపూర్‌లో గల మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు జిల్లాస్థాయి సీఎం కప్ క్రీడాపోటీల్లో ప్రతిభ చూపారని ప్రిన్సిపాల్ సుకన్య తెలిపారు. పాఠశాల ఆవరణలో మంగళవారం క్రీడాకారులు వైష్ణవి, హిమబిందు, సుజాత, బిక్కుబాయి, కీర్తన, సంధ్యారాణి, నందిని, స్వర్ణను అభినందించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ నెల 9న సిర్పూర్(యూ)లో జరిగిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో బాలికలు ప్రతిభ చూపి మొదటి బహుమతి కై వసం చేసుకున్నారని తెలిపారు.


