ఆసిఫాబాద్‌లో కాషాయజెండా ఎగురవేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆసిఫాబాద్‌లో కాషాయజెండా ఎగురవేయాలి

Feb 1 2026 3:13 AM | Updated on Feb 1 2026 3:13 AM

ఆసిఫాబాద్‌లో కాషాయజెండా ఎగురవేయాలి

ఆసిఫాబాద్‌లో కాషాయజెండా ఎగురవేయాలి

● ఎంపీ గోడం నగేష్‌

ఆసిఫాబాద్‌: తొలిసారి జరుగుతున్న ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో కషాయ జెండా ఎగురవేయాలని ఎంపీ గోడం నగేశ్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మున్సిపల్‌ ఎన్నిక ల ఇన్‌చార్జి అరిగెల నాగేశ్వర్‌రావు, జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలంతో కలిసి కౌన్సిలర్‌ అభ్యర్థులు, కన్వీ నర్లు, ప్రభారీలకు మున్సిపల్‌ ఎన్నికలపై దిశా నిర్దే శం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఓటర్లకు వివరించాలన్నారు. గతంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల పా లన చూశారని, బీజేపీకి ఒక అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్ర ధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్‌, కోవ విజయ్‌, కోశాధికారి కిరణ్‌, కొట్నాక విజయ్‌, సుంకరి పెంటయ్య, రాజేంద్రప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

గ్యారంటీల పేరుతో మభ్యపెడుతున్న కాంగ్రెస్‌

కాగజ్‌నగర్‌టౌన్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెడుతోందని ఎంపీ గోడం నగేష్‌ అన్నారు. శనివారం కాగజ్‌నగర్‌లోని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు నివాసంలో ఎన్ని కల్లో పోటీచేసే అభ్యర్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 30వార్డుల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించామన్నారు. మున్సిపాలిటీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ అభివృద్ధి కి కేంద్ర ప్రభుత్వం రూ.35 కోట్ల నిధులు మంజూ రు చేసిందన్నారు. పట్టణంలో డ్రెయినేజీల నిర్మా ణం సరిగా లేకపోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయన్నారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీకి కృషి చేస్తామన్నారు. కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌లో వందేభారత్‌, కేరళ ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు రైళ్ల హాల్టింగ్‌కు కృషి చేసినట్లు తెలిపారు. స మావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, పట్టణ అధ్యక్షుడు శివకుమార్‌, నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement