సమ్మక్క తల్లి ఆగమనం | - | Sakshi
Sakshi News home page

సమ్మక్క తల్లి ఆగమనం

Jan 30 2026 6:50 AM | Updated on Jan 30 2026 6:50 AM

సమ్మక

సమ్మక్క తల్లి ఆగమనం

వనదేవతలు వనం వీడి జనంలోకి వచ్చారు. గురువారం సమ్మక్క తల్లి ఆగమనంతో జాతర పరిపూర్ణమైంది. రెబ్బెన మండలం గోలేటి పంచాయతీ పరిధిలోని లక్ష్మీపూర్‌ శివారులోని కంకల వనం నుంచి సమ్మక్క తల్లిని పూజారులు దేవర వినోద్‌, గొల్లపల్లి సత్తమ్మ తీసుకువచ్చి గంగాపూర్‌ వాగు ఒడ్డున ఉన్న గద్దెలపై ప్రతిష్టించారు. అలాగే గోలేటి పరిధిలోని పల్లవి ఫ్యాక్టరీ సమీపంలో ఇగురపు స్వామి కంకసిల్ల, కుంకుమ బరిడి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెల వద్దకు తీసుకువచ్చారు. పల్లవి ఫ్యాక్టరీ వెనకాల ఉన్న సమ్మక్క, సారలమ్మ గద్దెలను గురువారం రాత్రి బెల్లంపల్లి ఏరియా జనరల్‌ మేనేజర్‌ విజయ భాస్కర్‌రెడ్డి, గోలేటి సర్పంచ్‌ అజ్మీర బాబురావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వనదేవతలకు బంగారం సమర్పించి పూజలు చేశారు. కార్యక్రమంలో ఖైరిగూర పీవో నరేందర్‌, ప్రాజెక్టు ఇంజినీర్‌ వీరన్న, డీజీఎం సివిల్‌ మదీనాబాషా, కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి మండల అధ్యక్షుడు కేసరి కిషన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. – రెబ్బెన

సమ్మక్కను తీసుకువస్తున్న పూజారులు

పూజలు చేస్తున్న జీఎం విజయ భాస్కర్‌రెడ్డి

సమ్మక్క తల్లి ఆగమనం1
1/1

సమ్మక్క తల్లి ఆగమనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement