7న కాగజ్‌నగర్‌కు మహారాష్ట్ర సీఎం | - | Sakshi
Sakshi News home page

7న కాగజ్‌నగర్‌కు మహారాష్ట్ర సీఎం

Feb 6 2026 7:52 AM | Updated on Feb 6 2026 7:52 AM

7న కాగజ్‌నగర్‌కు మహారాష్ట్ర సీఎం

7న కాగజ్‌నగర్‌కు మహారాష్ట్ర సీఎం

కాగజ్‌నగర్‌టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 7న కాగజ్‌నగర్‌ పట్టణానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ రానున్నారు. పాత హనుమాన్‌ దేవాలయం వద్ద సభాస్థలిని గురువారం ఎస్పీ నితిక పంత్‌ పరిశీలించారు. హెలిప్యాడ్‌ను పరిశీలించి భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేయాలని పోలీసులను ఆదేశించారు. కార్యక్రమంలో కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహీదుద్దీన్‌, ిసీఐలు ప్రేంకుమార్‌, కుమారస్వామి ఉన్నారు.

సభాస్థలికి ఎమ్మెల్యే హరీశ్‌బాబు భూమిపూజ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా హాజరుకానున్న సభాస్థలి వద్ద గురువా రం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు భూమిపూజ నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల కు పట్టణంలోని పాత హనుమాన్‌ దేవాలయం వద్ద సభ జరుగుతుందని తెలిపారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు రావాలని పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి, మున్సిపల్‌ అభివృద్ధి కోసం ప్రజలు కాషాయ జెండా వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్‌, పట్టణ అధ్యక్షు డు శివకుమార్‌, నాయకులు శ్రవంతబాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement