ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి
కాగజ్‌నరగ్‌టౌన్: ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. పట్టణంలోని బాలవిద్యామందిర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూం, కౌంటింగ్ హాళ్లను బుధవారం సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పరిశీలించారు. ఆయ న మాట్లాడుతూ సీసీ కెమెరాలు, విద్యుత్ సరఫరా, తాగునీటి సదుపాయం, పారిశుద్ధ్య నిర్వహణ, భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, డిప్యూటీ ఈఈ రమాదేవి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.


