సామగ్రి పంపిణీ పకడ్బందీగా చేపట్టాలి
ఆసిఫాబాద్: జిల్లాలో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లను గురువారం సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలకు సమర్థవంతంగా సామగ్రి పంపిణీ చేయాలన్నారు. ఇబ్బందులు తలెత్తకుండా కౌంటర్లు ఏర్పాటు చేయాలని, తాగునీరు, నీడ, విద్యుత్ సరఫరా, కనీస వసతులు కల్పించాలని ఆదేశించారు. కట్టుదిట్టమైన భద్రత చేపట్టాలని సూచించారు. సీసీ కెమరాలతో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రియాజ్ అలీ, ఎన్నికల విభాగం సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


