ప్రగతికే పట్టం! | - | Sakshi
Sakshi News home page

ప్రగతికే పట్టం!

Feb 6 2026 7:52 AM | Updated on Feb 6 2026 7:52 AM

ప్రగత

ప్రగతికే పట్టం!

ఆసిఫాబాద్‌ పట్టణాభివృద్ధికి కృషి చేయాలి

రోడ్లు విస్తరించాలి.. డ్రెయినేజీలు నిర్మించాలి

‘సాక్షి’ డిబేట్‌లో సమస్యలు ఏకరువు పెట్టిన వాకర్స్‌

ఆసిఫాబాద్‌: జిల్లా కేంద్రం ఆసిఫాబాద్‌ మున్సిపాలి టీలో సమస్యలు తాండవిస్తున్నాయి. ప్రత్యేక జిల్లా ఏర్పడి తొమ్మిదేళ్లవుతున్నా ఆశించిన అభివృద్ధి కానరావడం లేదు. పట్టణంలో 20 వార్డుల్లో సుమారు16 వేల జనాభా ఉంది. బల్దియాకు ఏటా రూ.కోటి కి పైగా ఆదాయం సమకూరుతోంది. అయినా కాలనీల్లో సదుపాయాలు మెరుగుపడటం లేదు. ముఖ్యంగా డ్రెయినేజీలు, సీసీ రోడ్లు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. తొలి సారి ఎన్నికలు జరుగుతున్న ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీపై జెండా ఎగురవేసేందుకు అన్ని పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే పట్టణ ప్రగతికి కృషి చేసేవారికే పట్టం కడతామని పట్టణవాసులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పిల్లల పార్క్‌లో గురువారం ఉదయం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన డిబేట్‌లో వాకర్స్‌ మున్సిపల్‌ పరిధిలోని సమస్యలను ఏకరువు పెట్టారు. పట్టణ సమస్యలను వెలుగులోకి తెచ్చారు. నూతనంగా కొలువుదీరే పాలకవర్గాలు పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించాలని వారు కోరారు.

‘సాక్షి’ డిబేట్‌లో పాల్గొన్న వాకర్స్‌

వైద్యసేవలు మెరుగుపర్చాలి

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు మెరుగుపర్చాలి. ముఖ్యంగా డెంటల్‌ సేవలు అందడం లేదు. రూ.కోట్లు వెచ్చించి ఆధునికీకరించినా స్థానికులకు ఉపయోగపడటం లేదు. ఆస్పత్రిలో అన్నిరకాల వైద్యులను నియమించాలి.

– సొన్నాయిల శంకర్‌, విశ్రాంత ఆర్టీసీ డ్రైవర్‌

ప్రగతికే పట్టం!1
1/2

ప్రగతికే పట్టం!

ప్రగతికే పట్టం!2
2/2

ప్రగతికే పట్టం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement