మున్సిపల్ పోరుకు నగారా
ఫిబ్రవరి 11న ఎన్నికలు.. 13న ఫలితాలు నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం టికెట్ల వేట ప్రారంభించిన ఆశావహులు జిల్లాలో రెండు మున్సిపాలిటీలు
ఆసిఫాబాద్/కాగజ్‌నగర్‌టౌన్: మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. ఫిబ్రవరి 11న పుర పోరు జరగనుంది. 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని షె డ్యూల్ విడుదల చేశా రు. జిల్లాలో ఆసిఫా బాద్, కాగజ్‌నగర్ ము న్సిపాలిటీలు ఉన్నాయి. ఆసిఫాబాద్ పట్టణంలో 20 వార్డులు ఉండగా 13,927 మంది ఓటర్లు(పురుషులు 6,822, మహిళలు 7,103, ఇతరులు ఇద్దరు) ఉన్నారు. అ లాగే కాగజ్‌నగర్ పట్ట ణంలోని 30 వార్డుల్లో 51,205 మంది ఓటర్లు(పురుషులు 25,004, మహిళలు 26,193, ఇతరులు 8 మంది) ఉన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం నంబర్ 85008 44365 ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ కె.హరిత తెలిపారు. పోలింగ్ కేంద్రాల సమాచారం కోసం, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై ఫిర్యాదు చేసేందుకు సంప్రదించాలని సూచించారు.
నేటి నుంచి నామినేషన్లు
15 రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది. నేటి(బుధవారం) నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 31న పరిశీలించి అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రదర్శిస్తారు. ఫిబ్రవరి 1న అభ్యంతరాల స్వీకరణ, 2న వాటి పరిశీలన, 3 వరకు ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. అదేరోజు పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా ప్రదర్శిస్తారు. ఈ నెల 11న పోలింగ్ నిర్వహిస్తారు. 12న అవసరమైన చోట్ల రీపోలింగ్ ఉంటుంది. 13న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు. ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ బీసీ జనరల్, కాగజ్‌నగర్ మున్సిపల్ పీఠం బీసీ మహిళకు రిజర్వేషన్ అయ్యింది. నూతనంగా ఏర్పడిన ఆసిఫాబాద్‌తోపాటు పారిశ్రామిక ప్రాంతం కాగజ్‌నగర్‌లో పట్టు నిలుపుకోవాలని పార్టీలు కసరత్తు ప్రారంభించాయి.
కాలనీల్లో పెరిగిన పర్యటనలు
ఎన్నికల నేపథ్యంలో కాలనీల్లో నేతల పర్యటనలు పెరిగాయి. ప్రధాన పార్టీల నాయకులు ప్రజాసమస్యలు అడిగి తెలుసుకుంటూ సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. రెండు పురపాలికల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటంతో మహిళా సంఘాలను సంప్రదిస్తున్నారు. మరో వైపు పార్టీ బీంఫాం కోసం నాయకుల ఇళ్ల ఎదుట పడిగాపులు కాస్తున్నారు.
రిజర్వేషన్లు ఇలా..
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ
రిజర్వేషన్ వార్డులు
జనరల్ 06, 09, 15, 17
జనరల్ మహిళ 07, 13, 14, 18, 19, 20
బీసీ జనరల్ 02, 03, 11
బీసీ మహిళ 05, 08
ఎస్సీ జనరల్ 01, 10
ఎస్సీ మహిళ 16
ఎస్టీ జనరల్ 04
ఎస్టీ మహిళ 12
కాగజ్‌నగర్ మున్సిపాలిటీ
జనరల్ 05, 08, 10, 11, 24, 26
జనరల్ మహిళ 06, 07, 09, 14, 18, 20, 21, 23, 27
బీసీ జనరల్ 15, 16, 17, 22, 29
బీసీ మహిళ 01, 03, 04, 13
ఎస్సీ మహిళ 12, 19
ఎస్టీ జనరల్ 02, 25, 28
ఎస్టీ జనరల్ 30
ఆశావహుల జోరు
ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఆశావహులు టికెట్ల వేటలో జోరు పెంచారు. సమయం తక్కువగా ఉండటంతో పార్టీలకు అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములా మారింది. ఆయా పార్టీలో ఏళ్లుగా చురుగ్గా పనిచేస్తున్న వారితోపాటు కొత్తవారు టికెట్లు ఆశిస్తున్నారు. రిజర్వేషన్లు కలిసొచ్చిన సామాజిక వర్గానికి చెందిన వారు పదవుల కోసం ఉవ్విళ్లురుతున్నారు. ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, బీఆర్‌ఎస్ నేతలు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, కోనేరు కోనప్ప అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరించనున్నారు. ఈ క్రమంలో బీఫాంలు ఎవరికి దక్కుతాయనేది కొన్నిరోజుల్లో తేలనుంది. మరోవైపు టికెట్లు దక్కనివారు స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
మున్సిపల్ పోరుకు నగారా
మున్సిపల్ పోరుకు నగారా


