జాతీయస్థాయి పోటీలకు ‘మోడల్’ విద్యార్థి
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థిని బోయిని వర్షిని జాతీయస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ మహేశ్వర్ తెలిపారు. పాఠశాల ఆవరణలో మంగళవారం పీడీ తిరుపతితో కలిసి విద్యార్థిని అభినందించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి 18 వరకు ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్‌జీఎ ఫ్ అండర్– 14 నెట్‌బాల్ పోటీల్లో వర్షిని ఉత్తమ ప్రతిభ చూపిందన్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మహారాష్ట్రలో నాందేడ్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీవర్ధన్, వెంకటేశం పాల్గొన్నారు.


