పకడ్బందీగా నామినేషన్ల స్వీకరణ
ఆసిఫాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కె.హరిత ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్‌తో కలిసి రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టాలన్నారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ, అభ్యర్థుల జాబితా, గుర్తుల కేటా యింపులో బాధ్యతాయుతంగా వ్యవహరించాల ని సూచించారు. కార్యక్రమంలో శిక్షకులు ఊశన్న తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అ న్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, డీజీపీ శివధర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, ఎస్పీలు, అదన పు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఎన్నికలపై సమీక్షించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమలు చేయాలని, ఫ్లయింగ్ స్టాటిస్టిక్ సర్వేయలెన్స్ బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కె.హరిత, ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, కాగజ్‌నగర్ డీఎస్పీ వహిదుద్దీన్‌తో కలిసి వీడియోకాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్‌రూం, కౌంటింగ్ కేంద్రాల్లో భద్రత చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ వివరించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు గజానంద్, తిరుప తి, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.


