గనులు పరిశీలన
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలో మూసివేసిన డోర్లి–1, డోర్లి–2 ఓసీపీలు, ఉత్పత్తి సాధిస్తు న్న ఖైరిగూర ఓసీపీని అదనపు కలెక్టర్ డేవిడ్ సందర్శించారు. ఫైనల్ మైన్ క్లోజర్ తనిఖీల్లో భాగంగా మూతపడిన గనితోపాటు పరిసర ప్రాంతాలు, సమీప గ్రామాల్లో చేపట్టిన పర్యావరణ, ప్రజాహిత పనులు, కట్టడాలు, రోడ్లు, వంతెనలు పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి జీఎం మచ్చగిరి నరేందర్, గోలేటి ఓసీపీ పీవో ఉమాకాంత్, సర్వే అధికారి అఫ్సర్‌పాషా, ఎస్టేట్స్ అధికారి సాగర్, మేనేజర్ మహేశ్ పాల్గొన్నారు.


