నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

Feb 4 2026 7:09 AM | Updated on Feb 4 2026 7:09 AM

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

● ఎస్పీ నితిక పంత్‌

కాగజ్‌నగర్‌టౌన్‌: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నితిక పంత్‌ అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని కౌసర్‌నగర్‌ మసీద్‌ నుంచి బాలాజీనగర్‌ బోర్డు మీదుగా రాజీవ్‌ గాంధీ చౌరస్తా వరకు పలు వీధుల గుండా మంగళవారం పోలీసులు ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించా రు. ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 11న జరిగే ము న్సిపల్‌ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛాయుతంగా ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు చేపతున్నామని తెలిపారు. బెదిరింపులకు పాల్పడడం, అక్రమ రవాణా చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, ప్ర చారాలు నిర్వహించొద్దన్నారు. డబ్బులు, మద్యం, బహుమతుల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే ప్ర యత్నాలు గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. జిల్లాలో నాలుగు చెక్‌పోస్టులు ఏ ర్పాటు చేసి, సమస్యాత్మక వార్డులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహీదుద్దీన్‌, సీఐ ప్రేంకుమార్‌, ఎస్సైలు సుధాకర్‌, చంద్రశేఖర్‌, సందీప్‌కుమార్‌, కల్యాణ్‌, రాజు, అనిల్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement