మొదటిసారి ఓటు వేయనున్న యువత | - | Sakshi
Sakshi News home page

మొదటిసారి ఓటు వేయనున్న యువత

Feb 10 2026 7:28 AM | Updated on Feb 10 2026 7:28 AM

మొదటి

మొదటిసారి ఓటు వేయనున్న యువత

● పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచన ● అందుబాటులో ఉన్నవారిని గెలిపించుకుంటామని స్పష్టీకరణ

ఆసిఫాబాద్‌అర్బన్‌: మరికొద్ది గంటల్లో జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ పట్టణాల్లో మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి. యువత తొలిసారి ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహంగా ఉన్నారు. అభివృద్ధిపై దృష్టి సారిస్తూ.. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేసే నీతివంతులైన నాయకులకు ఓటు వేస్తామని చెబుతున్నారు. బాధ్యతగా ఓటుహక్కు వినియోగించుకుంటామని, ప్రజలంతా తప్పనిసరిగా ఓటు వేయాలని సూచిస్తున్నారు.

నీతివంతులకే పట్టం

అందుబాటులో ఉండే వారికే..

ఎన్నికల సమయంలో పార్టీలు, కులమతాలకు అతీతంగా నీతివంతుడైన నాయకుడికి ఓటు వేయాలి. డబ్బులు తీసుకోకుండా గెలిపించాలి. భవిష్యత్‌లో అతడు అవినీతికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ఇచ్చిన హామీలను పరిశీలించి ఓటు వేస్తా.

– సాయికృష్ణ, ఆసిఫాబాద్‌

పార్టీలకు అతీతంగా ఎల్లప్పుడు ప్రజల మధ్య ఉంటూ.. వారి సమస్యలు పరిష్కరించేవారికే తొలిఓటు వేస్తా. ప్రజాప్రతినిధులు ఒత్తిడికి తలొగ్గకుండా పనిచేస్తేనే కాలనీలు అభివృద్ధి చెందుతాయి. ప్రజలు సైతం ప్రజాప్రతినిధులను ప్రశ్నించాలి.

– ప్రద్యుమ్న(శ్రేయస్‌), బీటెక్‌, ఆసిఫాబాద్‌

యువత పాలకులుగా మారాలి

ప్రశ్నించేతత్వం కావాలి

ప్రస్తుతం యువత రాజ కీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. నూత న ఆలోచనలతో ప్రజల కు సేవ చేసేందుకు యువత పాలకులుగా మారాలి. ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికల్లో యువతీ యువకులు పోటీ చేయడం ఆనందంగా ఉంది. తొలిసారి ఓటు వేసేందుకు ఉత్సాహంగా ఉన్నా..

– శ్వేత, బీటెక్‌, ఆసిఫాబాద్‌

అవినీతి, అక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రశ్నించేతత్వం యువతలో రావాలి. అప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయి. చదువుకుని చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. ఎన్నికల్లో డబ్బు, ఇతర ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛాయుతంగా ఓటు వేస్తా.

– నిఖిత, బీటెక్‌, ఆసిఫాబాద్‌

మొదటిసారి ఓటు వేయనున్న యువత1
1/6

మొదటిసారి ఓటు వేయనున్న యువత

మొదటిసారి ఓటు వేయనున్న యువత2
2/6

మొదటిసారి ఓటు వేయనున్న యువత

మొదటిసారి ఓటు వేయనున్న యువత3
3/6

మొదటిసారి ఓటు వేయనున్న యువత

మొదటిసారి ఓటు వేయనున్న యువత4
4/6

మొదటిసారి ఓటు వేయనున్న యువత

మొదటిసారి ఓటు వేయనున్న యువత5
5/6

మొదటిసారి ఓటు వేయనున్న యువత

మొదటిసారి ఓటు వేయనున్న యువత6
6/6

మొదటిసారి ఓటు వేయనున్న యువత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement