డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఏర్పాట్లు పరిశీలన
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సోమవారం ఎస్పీ నితిక పంత్ పరిశీలించారు. కేంద్రంలో ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల(బాలికలు), ఉర్దూ జెడ్పీ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పో లింగ్ రోజు తీసుకోవాల్సిన భద్రతపై పోలీసు అధి కారులతో చర్చించారు. సీఐ బాలా జీ వరప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ సతీశ్, మున్సిపల్ కమిషనర్ గజానంద్ తదితరులు ఉన్నారు.
712 మందితో పటిష్ట బందోబస్తు
ఆసిఫాబాద్‌అర్బన్: ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపల్ ఎన్నికలను 712 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ నితిక పంత్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమలులో ఉంటుందన్నారు. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి బుధవారం వరకు సైలెంట్ పీరియడ్ అమలులో ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో ప్రచారం, ర్యాలీలు, లౌడ్ స్పీకర్లు, సమావేశాలు పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, ఘటనలను గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు.


