ఎన్నికలకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలి

Feb 10 2026 7:28 AM | Updated on Feb 10 2026 7:28 AM

ఎన్నికలకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలి

ఎన్నికలకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలి

● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కె.హరిత

ఆసిఫాబాద్‌/కాగజ్‌నగర్‌రూరల్‌: మున్సిపల్‌ ఎన్నికలు, కౌంటింగ్‌కు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, కాగజ్‌నగర్‌ పట్టణంలోని డీఏవీ(పాత బాలవిద్యామందిర్‌ పాఠశాల)లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ, స్ట్రాంగ్‌రూమ్‌, కౌంటింగ్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రాలను సోమవారం పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి అవసరమైన నీడ, కుర్చీలు, తాగునీరు, భోజన వసతి కల్పించాలన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద బందోబస్తుతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, తహసీల్దార్‌ మధుకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మూడో విడత ర్యాండమైజేషన్‌ పూర్తి

ఆసిఫాబాద్‌: మూడో విడత ర్యాండమైజేషన్‌ పూర్తిచేసినట్లు కలెక్టర్‌ కె.హరిత తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గల వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో సోమవారం సాధారణ పరిశీలకుడు అలోక్‌ కుమార్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి మూడో విడత ర్యాండమైజేషన్‌ చేపట్టారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో రిజర్వ్‌ టీంతో కలిపి 35 టీంలు, కాగజ్‌నగర్‌లో మున్సిపాలిటీలో 102 టీంలు ఏర్పాటు చేశామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement