ప్రజా వ్యతిరేక బడ్జెట్
కాగజ్‌నగర్‌టౌన్: కార్మిక ప్రజలు, సామాజికంగా దోపిడీకి గురవుతున్న వర్గాలు, అలాగే దేశ ఆర్థిక ప్రయోజనాలను పక్కనపెట్టి ఈ బడ్జెట్ రూపొందించారు. 2025–26లో పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం, జీఎస్టీ ఆదాయాల్లో వచ్చిన లోటు, చుమురు మీద వేసే ఎకై ్సజ్ డ్యూటీ పెంపులను భర్తీ చేశారు. పన్ను ప్రతిపాదనలతో వచ్చే ఆదాయ ప్రభావాల గురించి ఒక్కమాట కూడా చెప్పలేదు. వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమ రంగాల్లో ఖర్చులు తీవ్రంగా కోతకు గురయ్యాయి. రాష్ట్రాలకు ఇచ్చే నిధులను 2025–26లో రూ.2,03,801 కోట్లు, 2026– 27లో బడ్జెట్ అంచనాల్లో రూ.59,456 కోట్ల తగ్గింపు చూపించారు.
– ముంజం ఆనంద్‌కుమార్,
సీపీఎం సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్


