మహిళలకు రక్షణ కల్పించాలి
దహెగాం: మండలంలోని రాళ్లగూడకు చెంది న ఆత్మకూరి కళావతిని హత్యచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించి మహిళలకు రక్షణ క ల్పించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి దుర్గం అనిత అన్నారు. శనివారం బాధిత కుటుంబా న్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడు నెలల క్రితం ఇదే మండలంలోని గెర్రె గ్రామంలో నిండు గర్భిణి తలాండి శ్రావణి కులదురహంకార హత్య మరువక ముందే మరో ఘటన చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. జిల్లాలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఐదెకరాల భూమి, డబుల్ బెడ్‌రూం ఇల్లు, పిల్లల చదువుకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు వినోద, జిల్లా సహాయ కార్యదర్శి నంది పద్మ, నాయకులు షాహీన్, సరస్వతి, తదితరులు పాల్గొన్నారు.


