ఉపాధ్యాయుల పాత్ర కీలకం
రెబ్బెన: పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఖైరిగూర ప్రాజెక్టు అధికారి మచ్చగిరి నరేందర్ అన్నా రు. పీఆర్టీయూ టీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం గోలేటి టౌన్‌షిప్‌లో ని భీమన్న స్టేడియంలో జిల్లాస్థాయి ప్రభుత్వ ఉపాధ్యాయుల క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశా రు. ఎస్సై వెంకటకృష్ణ, గోలేటి సర్పంచ్ అజ్మీ ర బాబురావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఏటుకూరి శ్రీనివాసరావు, ఎంఈవో వెంకటేశ్వర్లుతో కలిసి క్రికెట్ పోటీలు ప్రారంభించా రు. ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్ర స్తుత కాలంలో విద్యార్థులకు చదువుతో పా టు నైతిక విలువలను పాఠశాల స్థాయి నుంచే నేర్పించాలన్నారు. అనంతరం క్రీడాకారుల ను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్. తిరుపతి, టీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్, నాయకులు ఉప్పల నరసింహాచారీ, జ్ఞానేశ్వర్, శ్రావణ్‌కుమార్, వినోద్‌కుమార్, శ్రీకాంత్, బత్తుల సదానందం, వెంకటేశ్వర్లు, ప్రకాశ్, యాదగిరి, వినేష్, రవి, వివిధ సంఘాల నాయకులు తిరుపతి, శ్రావణ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


