‘కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు’
కాగజ్‌నగర్‌టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, కాగజ్‌నగర్ మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దాసోజు శ్రావణ్ అన్నారు. పట్టణంలోని వినయ్‌గార్డెన్‌లో గురువారం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రాన్ని అధినేత కేసీఆర్ సాధించడంతోనే ఈ రోజు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ములేకనే దొంక తిరుగుడు రాజకీయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుందని ఆరోపించారు. 24 నెలల్లో రెండుసార్లు సిట్ నోటీసులు ఇవ్వడం చరిత్రలోనే మొదటిసారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో నాయకులు సీపీ రాజ్‌కుమార్, శ్యాంరావు, సలీం, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్టీ నాయకులతో సమావేశం
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి దాసోజు శ్రావణ్ గురువారం ఆ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆయనకు స్వాగతం పలికారు. దాసోజు శ్రావణ్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ బుర్స పోచయ్య, నాయకులు అలీబిన్ అహ్మద్, మర్సోకోల సరస్వతి, జీవన్, సురేశ్, బాలకృష్ణ పాల్గొన్నారు.


