అభిమానంతో ఇండిపెండెంట్‌గా గెలిపించారు
1987లో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏరియాల్లో అందరూ కలిసి అభిమానంతో కౌన్సిలర్‌గా నిలబెట్టి గెలిపించారు. అప్పుడు ఈఎస్‌ఐ కాలనీ నుంచి పెట్రోల్ పంప్ ఏరియా వరకు వార్డు ఉండేది. కాలనీవాసులు ‘ముబీన్ బాయ్ మీకు అండగా మేముంటాం’ అంటూ ఇండిపెండెంట్‌గా ఒక పైసా కూడా ఖర్చులేకుండా గెలిపించారు. ఆ తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను. 1987లో బుచ్చిలింగం చైర్మన్‌గా ఉన్నప్పుడు 20 మంది కౌన్సిర్లలో నేను ఒకడిని. మా హయాంలో పట్టణంలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి రాజీవ్‌గాంధీ చౌరస్తాగా నామకరణం చేశాం. అంతకుముందు బాబీ హోటల్‌గా ఉండేది. మాజీ ఎంపీ నర్సారెడ్డి మంచి మిత్రుడుగా ఉండే. ఆయన అండదండలతో పట్టణంలో ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించేందుకు కృషి చేశాను. గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీలో బోర్డు మెంబర్, గ్రేట్ మ్యాన్ ఆఫ్ కాంగ్రెస్ అవార్డులను అందుకున్నాను. – ముబీన్, మాజీ కౌన్సిలర్


