మాట మీద ఉండేవాళ్లం
2000 సంవత్సరంలో మున్సిపల్ కౌన్సిలర్‌గా గెలుపొందాను. అందరం మాట మీద ఉండే వాళ్లం. ఏదైనా పని చేయాలంటే అనుకోని చేసేవాళ్లం. పట్టణ అభివృద్ధికి కలిసికట్టుగా నిర్ణ యాలు తీసుకునేవాళ్లం. మున్సిపాలిటీ లో ప్రధానంగా ఒకే బీటీ రోడ్డు ఉండగా, అది ప్రధాన పెట్రోల్‌పంప్ నుంచి పేపర్ మిల్లు వరకు ఉండేది. అప్పట్లో కాలనీల్లో ఎక్కువగా తాగునీటి సరఫరా, మురుగు కాలువలు సమస్యలు ప్రధానమైనవి. మా పాలన హయాంలో రోడ్లు, 20 వార్డుల్లో మురుగు కాలువల నిర్మాణాలు చేపట్టాం. అప్పుడు 16వ వార్డు జనరల్ ఉండడంతో ఆ వార్డు నుంచి పోటీచేసి గెలుపొందాను. జూపాక నర్సయ్య రెండుసార్లు చైర్మన్‌గా కొనసాగారు. వారి హయాంలోనే మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చెందింది. ప్రస్తుత నాయకులు పట్టణాభివృద్ధికి కృషి చేయాలి.
– కలికోట రమణయ్య, మాజీ కౌన్సిలర్


