జాతరకు పటిష్ట బందోబస్తు
రెబ్బెన: గంగాపూర్‌లో బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 31 నుంచి నిర్వహించే జాతరకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ నితిక పంత్ తెలిపారు. గంగాపూర్ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని గురువారం సందర్శించి జాతర ఏర్పాట్లపై ఆరా తీశారు. దేవా లయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు, వాహనాల పార్కింగ్ కోసం కేటాయించి స్థలాలను పరిశీలించారు. మూడు రోజులపాటు జాతర మహోత్సవం సాఫీగా, భక్తులకు ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు కృషి చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. గుంపుల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, భద్రత ఏర్పాట్లు, అత్యవసర సేవలు, భక్తులకు సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో రెబ్బెన సీఐ సంజయ్, స్పెషల్ బ్రాంచ్ సీఐ సతీశ్ పాల్గొన్నారు.


